రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం.
మర్సుమల్లి పీఏసీఎస్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 04.08.2025.
మైలవరం మండలంలోని మర్సుమల్లి పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం పాల్గొన్నారు.
చైర్మన్గా కిలారు సత్యనారాయణ , సభ్యులుగా నీలపాల వెంకటేశ్వరరావు సగ్గుర్తి శ్యాంబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన త్రిసభ్య కమిటీని అభినందించారు.
శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ సభ్యులు రైతులకు విశేషంగా సేవలను అందించాలని సూచించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండాలన్నారు.
ప్రభుత్వ లక్ష్యాల మేరకు రైతుల అభ్యున్నతి ప్రధాన ధ్యేయంగా కృషి చేయాలన్నారు. సొసైటీని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు తోడు సొసైటీ ద్వారా రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు.
‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు వెల్లడించారు.
వ్యవసాయ సీజన్ ఆరంభం నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.