రెల్లి కుల సంఘ నాయకుడు వర కృష్ణ బిజెపిలో చేరిక

Spread the love

 రెల్లి కుల సంఘ నాయకుడు వర కృష్ణ బిజెపిలో చేరిక

విజయవాడ:

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రెల్లి కుల సంఘ నాయకుడు, వైయస్సార్సీపి నాయకుడు మాడుగుల వరకృష్ణ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో బిజెపిలో చేరిన వర కృష్ణకు మాజీ కేంద్ర మంత్రి సయ్యద్ షాన్ వాజ్ హుస్సేన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని వర కృష్ణకు కేంద్రమంత్రి సయ్యద్ షాన్ వాజ్ హుస్సేన్, సుజనా చౌదరి సూచించారు. బీజేపీ పార్టీ లో చేరిన మాడుగుల వరకిష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని, అయినప్పటికీ పార్టీలో ఎటువంటి గుర్తింపు, గౌరవం లేకపోవడంతో వైయస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరినట్లు చెప్పారు. వర కృష్ణ తో పాటు పెద్ద సంఖ్యలో రెల్లి కుల సంఘ ప్రముఖులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వర కృష్ణ అభిమానులు పార్టీలో చేరగా వారికి సైతం మాజీ కేంద్రమంత్రి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *