26-06-2025
రెండు నెలల్లో కట్లేరు బ్రిడ్జ్ సమస్యకి శాశ్వత పరిష్కారానికి కృషి : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
తిరువూరు మను గార్డెన్స్ లో తిరువూరు ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ గా రేగళ్ల లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారోత్సవం
ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, టిడిపి జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్
ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రేగళ్ల లక్ష్మీ అనిత
ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులు
తిరువూరు : గత ప్రభుత్వం అభివృద్ది విషయంలో రాష్ట్రాన్నే కాదు తిరువూరు నియోజకవర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరో రెండు నెలల్లో తిరువూరు లో నెలకొన్న సమస్యలతో పాటు, కట్లేరు బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం లభించనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
తిరువూరు మను గార్డెన్స్ లో గురువారం తిరువూరు వ్యవసాయ యార్డ్ ఛైర్ పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత పదవి బాధ్యత ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అధ్యక్షత వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ , టిటిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ సమక్షంలో తిరువూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా రేగళ్ల లక్ష్మీ అనిత ప్రమాణా స్వీకారం చేసింది. ఆమె తో పాటు పాలక వర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేవారు. అనంతరం ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత కు పుష్పగుచ్ఛం అందించి ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నిన్న తిరువూరు నగర పంచాయతీ ను గెలుచుకున్నాము.. ఇప్పుడు తిరువూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఛైర్ పర్సన్ పొందాము…జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువూరు లో ప్రతి గ్రామం, అర్బన్ ప్రాంతంలోని 20 వార్డ్ లు సొంతం చేసుకోబోతున్నామన్నారు. అలాగే కోర్ట్ సమస్యల వల్ల చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆలస్యం జరిగింది, కోర్టు సమస్య పరిష్కారం జరగ్గానే ఆ పనులు తక్షణం ప్రారంభమవుతాయన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తిరువూరు లో పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు చాలా బలంగా వున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలు
గత ప్రభత్వం వాటిని నిస్తేజం చేసిందని మండిపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ యార్డ్ కమిటీలకు పూర్వవైభవం వచ్చేలా కృషి చేయనున్నారని తెలిపారు.
నాలుగైదు నెల్లలో తిరువూరు నియోజకవర్గంలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
తిరువూరు లో నాలుగుసార్లుగా టిడిపి ఎమ్మెల్యే లేకపోయినా పార్టీ ఇంత బలోపేతంగా వుండటానికి కారణం టిడిపి నాయకులు కార్యకర్తలే అన్నారు. కొంతమంది టిడిపిను వీడటం వల్ల తిరువూరు లో టిడిపికి పునర్వైభవం వచ్చిందన్నారు. ఈ గెలుపు లో బిజెపి, జనసేన నాయకులు,కార్యకర్తల విశేష కృషి వుందని కొనియాడారు. ఎప్పటికీ వారి రుణం తీర్చుకోలేమంటూ వారికి అండగా వుంటామన్నారు.
తెలుగు దేశం పార్టీకి కార్యకర్తల సంక్షేమమే ముఖ్యం..వారి సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందన్నారు.
ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పదవులు రాలేదని నిరాశపడొద్దని….కులమతాలకు అతీతంగా వుండే కూటమి సామాజిక న్యాయం తో పాటు యువకులతో పాటు అందరికీ అవకాశం కల్పిస్తుందన్నారు.
ఎమ్మెల్యే జగన్ రౌడీలు గంజాయి బ్యాచ్ వెంట వేసుకుని రాష్ట్రంలో ఆరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు.ఇటీవల వైసిపి ఎమ్మెల్యే జగన్ కారు కింద ఒక ముసలాయన పడితే తొక్కించుకుంటూ వెళ్లిపోయారే తప్ప..ఆ పార్టీ వాళ్లు హాస్పటల్ కి తీసుకువెళ్లలేదన్నారు. దీంతో ఆ వ్యక్తి దాదాపు 45 నిమిషాలు ప్రాణాలతో పోరాడి చనిపోయాడన్నారు. క్రమశిక్షణకు మారుపేరు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు. ఆపదలో ఎవరైన కనిపిస్తే క్రమశిక్షణ గల ఎన్డీయే కూటమి కార్యకర్తలు ముందుగా హాస్పటల్ తరలిస్తారన్నారు. తల్లి, చెల్లి, జనాలను పట్టించుకోని ఎమ్మెల్యే జగన్ ను ప్రజా జీవితం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ , ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరిరాజేశ్వరరావు , తెలుగు రైతు సంఘం అధికార ప్రతినిధి కొఠారి సత్యనారాయణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ వాసం మునియ్య,తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ కొలికపోగు నిర్మల గంపల గూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, ఎ.కొండూరు మండలపార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి , విసన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు మట్టా వేణుగోపాల్, తిరువూరు వెదరు వెంకట నరిసిరెడ్డి , తిరువూరు టౌన్ బొమ్మసాని ఉమా మహేష్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, టిడిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్.ఫైజాన్, గంపల గూడెం మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎమ్.ఆర్.కె., ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ ( కిట్టు), వల్లభనేని గిరి, బిజెపి నాయకులు రామచంద్రరావు, శాంతి లతోపాటు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.