రూ.₹3,31,254 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన-MLA బొండా ఉమ

Spread the love

రూ.₹3,31,254 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన-MLA బొండా ఉమ

ధి:-6-11-2025 గురువారం సాయంత్రం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని 57, 59,25వ డివిజన్ ప్రాంతాలకు చెందిన చెందిన 8 మందికి ₹3,31,254 రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా (CMRF) చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగింది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గం లో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన అనంతరం వారి వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు అని, ఆ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 8 మందికి మంజూరైన రూ.₹3,31,254 మొత్తానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్యం అందజేస్తున్నామని వివరించారు, ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సహాయం అందేలా చూస్తున్నామని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని, ముఖ్యమంత్రి సహాయనిధి అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అది ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ఒక భరోసా అని…

గతంలో కూడా 2014 నుండి 2019 తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, దాదాపు 30,00,00,000 (ముప్పై కోట్ల రూపాయలు) విలువైన సహాయాన్ని అందించడం జరిగింది అని, ఇది ప్రజలకు మా నిబద్ధతకు నిదర్శనం ఆని ఈరోజు కూడా ఒక పని చేసేశాసనసభ్యుడు ఉంటే, ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, వారి సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో, ఏ విధంగా పని జరుగుతుందో ప్రజలు మీడియా ద్వారా ప్రజలు మా పనితీరును నిశితంగా గమనిస్తున్నారు అని…

మా కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి నిత్యం కూడా ప్రతి డివిజన్‌ నుంచి మా కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని, ప్రతి ముఖ్యమంత్రి సహాయ నిధి అప్లికేషన్ కు చెక్కు తీసుకొచ్చి వాళ్లకి అందజేస్తున్నాం అని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని, ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాము అని..

ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా దాదాపు 140 (నూట నలభై) రకాల జబ్బులకి ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నాయి  ఇది పేద ప్రజలకు ఒక వరం లాంటిది. వైద్య ఖర్చులు భరించలేని వారికి ఇది గొప్ప ఊరట అని, ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం చూపించుకొని,
బిల్లులు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది అని, ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తుంది అని, ఇది కాకుండా ₹25,00,000 (ఇరవై ఐదు లక్షల రూపాయలు) ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది, ఇది ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తుంది అని కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజలు బాగుండాలి ప్రజలకి
ఏ అనారోగ్యం వచ్చినా, ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అని, ఈ పనులన్నీ ప్రజల సంక్షేమం కోసమే ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని తెలియజేసారు.

సహాయం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే బొండా ఉమా కి, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో:- ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్,డైరెక్టర్ దొంగ అంజిబాబు డివిజన్ అధ్యక్షులు రాజాన బంగారం నాయుడు, మాచర్ల గోపి, మాచర్ల పావని, Sk ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు..

Loading