రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలకు సర్వం సిద్దం జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ.

6
0

విజయవాడ       తేది`24.01.2025

రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలకు సర్వం సిద్దం

జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ.

  ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో  76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు. 

శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ను ప్రభుత్వ కార్యదర్శి  ముఖేశ్‌ కుమార్‌ మీనా, డిజిపి ద్వారకా తిరుమలరావు, డిఐజి బి. రాజకుమారి, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ మోహన్‌, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్టాయి  అధికారులు పోలీస్‌ ఉన్నతాధికారులు, నగర పోలీస్‌ కమీషనర్‌ బి. రాజశేఖర్‌ బాబు, జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ  మాట్లాడుతూ  ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయి  76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి  సర్వం సిద్దం చేసిన్నట్లు ఆయన తెలిపారు.  

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం 8.51 నిమిషాలకు రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు, చేరుకుంటారని, ఉ. 8.55 నిమిషాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంథ్‌  ఉ. 8.56 నిమిషాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన నాయముర్తి గౌరవ జస్టిస్‌ థీరజ్‌ సింగ్‌ ఠాగూర్‌, ఉ.8.57 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉ. 8.58 నిమిషాలకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌  ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 9 గంటలకు  రాష్ట్ర గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరింస్తారని తెలిపారు. అనంరతం పోలీస్‌ పెరేడ్‌ను పరిశీలించి తిరిగి వేదిక చేరుకుని పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారన్నారు. గణతంత్ర వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన  వివిధ శాఖలు అమలు చేస్తున్న  సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు, మార్చ్‌ పాస్ట్‌లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు.   

వేడుకలలో ఇండియన్‌ ఆర్మీ కంటింజెంటు, కాకినాడ ఏపిఎస్‌పి 3వ బెటాలియన్‌,  సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌, తమిళనాడు రాష్ట్ర పోలీస్‌ దళం, విశాఖపట్నం ఏపిఎస్‌పి 16వ బెటాలియన్‌, ఏపి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌ బాలురు బాలికలు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ బాలురు బాలికలు, యూత్‌ రెడ్‌క్రాస్‌ బాలికలు బాలుర బృందాలు కవాతులో పాల్గొని కనువిందు చేయనున్నారన్నారు. పోలీస్‌లు బ్రాస్‌బ్యాండ్‌, పైపు బ్యాండ్‌ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here