రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి కామెంట్స్

1
0

విజయవాడ

రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి కామెంట్స్

విశాఖ విజయవాడ నగరాల్లో వేల కోట్లు విలువ చేసే భూములను ప్రయివేటు వాళ్ళకి ధారాదత్తం చేయడానికి పూనుకుంది కూటమి ప్రభుత్వం.

దీనిపై ఇప్పటికే జీవో 137 ను విడుదల చేశారు.

అయితే వైజాగ్ భూములు 90 ఏళ్ళు, విజయవాడ భూములను 60 ఏళ్ళకు లీజ్ కు ఇచ్చారు.

ఈ లులూ కంపెనీ సంస్థ వచ్చేది వ్యాపారం చేసుకోవడానికి కాదు. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం కోసం.

ఆ జీవో లో వైజాగ్ లో 3 లక్షల 30 వేల చదరపు అడుగులు, విజయవాడలో 1 లక్షా 34 వేల భూములను ప్రయివేటు వారికి విక్రయం చేయొచ్చు అని ఉంది.

ఇది సరైన విధానం కాదు.. చంద్రబాబు, లోకేష్ జేబులు నింపుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ లులూ మాల్.

దీన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.

గతంలో మేము ఆ ప్లేస్ లో ఆసుపత్రి కట్టాలని డిమాండ్ చేశాము.

ఆనాడు ఇదే చంద్రబాబు ఆ ఉద్యమాన్ని అనిచివేశారు.

మరి ఇప్పుడు ఎలా ఒక ప్రయివేటు సంస్థకు ధారాదత్తం చేస్తారు?

కాలువ వడ్డున ఏదైనా కట్టడాలు కడితే కలుషితం అవుతుందని అంటారు.. మరి ఇప్పుడు కాలువ పక్కన సంస్థను షాపింగ్ మాల్ కు ఎలా ఇస్తారు.

పేదలను కొట్టి పెద్దలకు పెట్టే విధంగా చంద్రబాబు పాలన ఉంది.

వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేనిపక్షంలో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తాం.

మా అధినేత జగన్ నెల్లూరు పర్యటన ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

జగన్ పర్యటనకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు.

జగన్ ను చూస్తేనే కూటమి నాయకులకు పాంట్ తడిచిపోతుంది, అందుకే ఆయన పర్యటనకు అన్ని ఆంక్షలు.

మా పార్టీ నాయకుడి ఇంటిపై దాడి చేస్తే ఆయన్ను పలకరించడానికి ఇంటికి జగన్ వెళ్తే తప్పేంటి?

కావాలనే నెల్లూరులో వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

జగన్ వస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా కార్యకర్తలు, అభిమానులు వస్తారు.

జగన్ ను ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తున నేలకు కొట్టిన బంతిలా పైకి వస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here