28-06-2025
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ.
క్రీడాభివృద్ధి లక్ష్యంగా మంత్రి–ఎంపీ భేటీ
విజయవాడ : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి శాలువా తో సత్కరించి విజయవాడ కనకదుర్గమ్మ చిత్ర పటాన్ని బహుకరించారు. అనంతరం ఇరువూరు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు మెరుగైన క్రీడా అవకాశాల కల్పనపై చర్చించుకున్నారు . అలాగే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA), ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) కార్యకలాపాల సమన్వయంపై విస్తృతంగా చర్చ జరిపారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు సమాలోచించారు