రాష్ట్ర ప్రజలకు శుభవార్త – అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్

Spread the love

 కృష్ణా జిల్లా/గుడివాడ

రాష్ట్ర ప్రజలకు శుభవార్త – అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న ‘అన్న క్యాంటీన్ల’ను గుడివాడలో సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తొలి విడతగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎన్నార్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలో హెలిప్యాడ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *