రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎలక్ట్రానిక్ మీడియా స్క్రోలింగ్ పాయింట్లు

Spread the love

 

కృష్ణా జిల్లా/పెనమలూరు

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎలక్ట్రానిక్ మీడియా స్క్రోలింగ్ పాయింట్లు

గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకటరమణ రావు కుటుంబ సభ్యులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు. ఆయన పెనుమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీవో నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలంటూ మంత్రి రామానాయుడు తెలిపారు. 

1) గత కొద్ది రోజులుగా అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల

2) ఎంపీడీవో కుటుంబ సభ్యులను ఓదార్చి అదృశ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి నిమ్మల 

3) ఎంపీడీవో అదృశ్య కేసు దర్యాప్తు పురోగతి, ఏలూరు కాలువలో గాలింపు చర్యలు గురించి , కృష్ణ పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీ, కలెక్టర్లతో ఫోన్లో ఆరా తీసిన మంత్రి నిమ్మల

4) కుటుంబ సభ్యులను అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ధైర్యంగా ఉండాలని చెప్పిన మంత్రి నిమ్మల.

5) ఏలూరు కాలువలో గాలింపు చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా గుర్తింపు చర్యలు మరియు దట్టంగా ఉన్న గుర్రపు డెక్క తొలగింపుకు అనుభవజ్ఞులైన లస్కర్ల ను ఉపయోగించేలా జల వనరుల శాఖ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చిన మంత్రి నిమ్మల

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *