రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించా… ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు

Spread the love

 ఇంద్రకీలాద్రి 

05-10-2024

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించా…

ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు

విజయవాడ :

రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలపై రాష్ట్ర ప్రజలపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని దుర్గామాతకు ప్రార్ధించినట్లు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ బాల్యం, విద్యాభ్యాసం చేసే సమయంలో క్రమం తప్పకుండా ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రుల సమయంలో క్రమం తప్పకుండా దర్శనం చేసుకునే వాడినని గుర్తు చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో అమ్మ వారిని దర్శించుకోలేక పోయానన్నారు. జగన్మాత అనుగ్రహంతో తిరిగి దర్శనం పొందగలిగానన్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని అభినందించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం వివరించారు. తన తల్లి పేరు కూడా అన్నపూర్ణ కావడం వల్లనే ప్రతి సంవత్సరము అన్నపూర్ణాదేవి అలంకారం రోజునే అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. ఏడాది ఇంతకంటే వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరిం చారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *