రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని 47వ డివిజన్ జనసేన అధ్యక్షుడు వెంపల్లి గౌరీ

Spread the love

 రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని 47వ డివిజన్ జనసేన అధ్యక్షుడు వెంపల్లి గౌరీ

 శంకర్ స్పష్టం చేశారు. ఎక్కువగా పేదలు, మరింత చిన్న తరహా పనులు చేసుకునే జీవించే ప్రజలు ఉన్న చిట్టినగర్ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఈ విషయమై చిట్టి నగర్ లో డివిజన్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో అన్నా క్యాంటీన్లను తీసివేసి పేద ప్రజల ఆగ్రహానికి గురి అయిందని అందుకే  గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వివరించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించిందని, ఈ నేపథ్యంలో పశ్చిమ నగరంలో మొత్తం మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారని, ఒకటి కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో ప్రారంభించగా మిగిలిన రెండు భవానిపురంలో దగ్గర దగ్గరగా   ఏర్పాటు చేశారని, పేదలు ఎక్కువగా నివాసం ఉండే చిట్టి నగర్  ప్రాంతంలో మాత్రం అన్న క్యాంటీన్ లేదని ప్రారంభించాల్సిన అవసరం ఉందని వివరించారు. చిట్టినగర్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు కూడా ఉన్నాయని వాటిని ఉపయోగించుకొవచ్చని సమాచారం ఇచ్చారు .

అన్నా క్యాంటీన్ అవ్వని పక్షంలో డొక్కా సీతమ్మ  క్యాంటీన్ అయినా పెట్టాలని అలా చేస్తే 

పవన్ కళ్యాణ్   పెంపొందిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు .

ఈ విషయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి  దృష్టికి కూడా తీసుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రబెల్లి కనకారావు. పడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *