రాష్ట్రంలో పరుగులు పెడుతున్న పారిశ్రామిక అభివృద్ధి : యార్లగడ్డ
- 10 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ఇప్పటికే ఒప్పందాలు
విజయవాడ రూరల్ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. గ్రామంలోని ఏలూరు కాలువ కట్ట, మద్యకట్ట, గోపాల్ కట్ట ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో యార్లగడ్డ పాల్గొని గత ఏడాది కాలం గా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన రాష్ట్రవ్యాప్త కరపత్రాన్ని, గనవరం నియోజకవర్గ కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాత చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఐటి కి చిరునామాగా మారనుందని, ఇప్పటికే పలు సంస్థలు విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. గన్నవరం ఐటీ పార్కులోను కొత్తగా ఐటీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని, వీటికి తోడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని యార్లగడ్డ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు ఖరారు అయ్యాయని యార్లగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరోవైపు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సర్నాల గంగా రంత్నం బాలాజీ, ఉపసర్పంచ్ గుడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, గుజ్జర్లపూడి బాబురావు, పరుచురి నరేష్, ఉలాస శివ, టీడీపీ ప్రార్థి ప్రెసిడెంట్ పోలిశెట్టి రమణ, మండల అధ్యక్షులు గొడ్డల చిన్న రామారావు, కోనేరు సందీప్, దాసరి మహేష్, నెక్కటి శ్రీదేవి, తుపాకులా శివలిలా, కొల్ల ఆనంద్, కానూరి యుగంధర్, పొదిలి లలిత, మేడేపల్లి రామ , కోనేరు నాని, పొదిలి దుర్గారావు, దాసరి గోకుల్ సాయి, గంప శ్రీనివాస్ యాదవ్, పోక కిరణ్, పట్టపు చంటి, నాభిగాని కొండయ్య, లింగాల వెంకటేష్, అంగిరేకుల గంగాధరరావు, కొలకలూరి ఏసుపాదం, బసు మధుసూదన్నారావు, పాటిబండ్ల శ్రీవిద్య, పొట్లూరి వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.