రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు మేలు చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కనకారావు

Spread the love

 రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు మేలు చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కనకారావు

నాయి బ్రాహ్మణులకు సీఎం జగన్ పెద్దపేట వేశారని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మల్కాపురం కనకారావు అన్నారు. సందర్భంగా విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం కనకారావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ జీవో నెంబర్ 6 లో హామీలు ఇచ్చారని, పాలక మండలిలో ట్రస్ట్ బోర్డు నుండి టిటిడి బోర్డు నెంబర్లుగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో సముచిత స్థానం ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కిందన్నారు. జీవో నెంబర్ 50 ద్వారా నాయి బ్రాహ్మణులను ఎవరైనా కుల దూషణ చేస్తే శిక్ష పడే విధంగా జీవోని తీసుకురావడం సంతోషదాయకం అన్నారు. గత ప్రభుత్వాలు నాయి బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించాయన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణ అంతా వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ట్రస్ట్ బోర్డ్ నెంబర్లుగా 6 ని నియమించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మలు అంతా వైసిపి ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ గణపతి రావు, మల్లవరపు నరసింహారావు, దాక్షరపు రాము పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *