రాష్ట్రంలోని 46.86 లక్షల మందికి అన్నదాత సుఖీభవ : యార్లగడ్డ

1
0

రాష్ట్రంలోని 46.86 లక్షల మందికి అన్నదాత సుఖీభవ : యార్లగడ్డ

గన్నవరం :
రైతులకు చేయూతనిచ్చేందుకు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 46.86 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శనివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులను యార్లగడ్డ విడుదల చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం కింద రైతులకు రూ. 3,174.43 కోట్ల నిధులు శుక్రవారం రాష్ట్రంలోని రైతులు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. తొలి రెండు విడతల్లో రూ. 2వేలు చొప్పున, మూడవ విడతలో రూ. 6 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈనెల రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోను కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు యార్లగడ్డ చెప్పారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో దాన్యం డబ్బును రైతు ఖాతాలో జమ చేసిన సంగతి ఈ సందర్భంగా యార్లగడ్డ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో దాన్యం సొమ్ము సకాలంలో ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తమ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బు చెల్లించినట్లు వివరించారు. గన్నవరం నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు యార్లగడ్డ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొడ్డలి చిన్న రామారావు, గుజ్జర్లపూడి బాబురావు, గుడవల్లి నరసయ్య, ఆళ్ల గోపాలకృష్ణ, గ్రామా పార్టీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి, గంప శ్రీనివాస యాదవ్, పొలారెడ్డి శ్రీనివాస రెడ్డి, మాదు శివరాంప్రసాద్, యర్కారెడ్డి కోటిరెడ్డి, బొకినాలా తిరుపతిరావు, తాగారం కిరణ్, నెక్కటి శ్రీ దేవి, గండికోట సీతయ్య, బెజవాడ రామకృష్ణ,పరుచూరి నరేష్, పోతురాజు, కొండేటి వెంకటరత్నం, పట్టపు చంటి, జనసేన నాయకులు మండ యుగంధర్, పామర్తి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here