
DT. 22-11-2025.
రాజధాని మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించిన మంత్రి నారాయణ.
స్వయంగా మహిళలు చేసిన రాగిజావను తాగిన మంత్రి నారాయ
రాజధాని మహిళలకు శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం
శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి నారాయణ
రాజధాని మహిళలు స్వయంగా తయారుచేసిన వంటకాల స్టాల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆర్గానిక్ మిల్లెట్స్ తో తయారుచేసిన స్వీట్స్, హాట్స్, జూసులు, లంచ్ బాక్స్ వంటి అనేక రకాల వంటకాలను పరిశీలించారు. మహిళ చేత తయారు చేసిన మిలిట్స్ రాగిజావను స్వయంగా తాగి దాని టెస్ట్ను మహిళలకు మంత్రి నారాయణ వివరించారు. వంటకాలు బాగున్నాయంటూ కితాబ్ ఇచ్చారు. గృహాలకే పరిమితమైన మహిళలు అలా ఉండిపోకూడదని అమరావతి రాజధాని లోని 29 గ్రామాలలో ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను సి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. మిల్లెట్స్ వంటకాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి వారి ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో భాగంగా నేడు సి ఆర్ డి ఏ కార్యాలయంలో మహిళలు తయారుచేసిన ప్రత్యేకమైన వంటకాలతో స్టాల్ ప్రదర్శన నిర్వహించారు. ఉండవల్లి రూరల్ మరియు అర్బన్, మందడం, అనంతవరం, ఎర్రబాలెం ఈ ఐదు గ్రామాల్లో సుమారు 250 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షలకు సంబంధించిన మహిళలకు మంత్రి నారాయణ చేత స్టాల్ వద్దే సర్టిఫికెట్లను అధికారులు అందజేయించారు. ఇలా గ్రామాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది…
![]()
