రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 60 శాతానికి మించి పోలింగ్ శాతం నమోదయింది. పుతిన్‌పై మూడు స్నేహపూర్వక పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగారు. ఈ ముగ్గురు వ్యక్తులు గత 24 ఏళ్ల పుతిన్ పాలనపై, ఉక్రెయిన్ యుద్ధంపై చిన్న విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం.
![]()

