28-7-2025
రజకులను ఆర్థికంగా ఆదుకునేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే
రజక వృత్తి చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం
శిధిలా వస్తలో ఉన్న ధోబికానాలన్నీ తక్షణమే శుభ్రం చేపిస్తాం
ధి:28-7-2025 సోమవారం సాయంత్రం 5:00″గం లకు” 27వ డివిజన్ పరిధిలోని సాంబమూర్తి రోడ్డు దుర్గాపురం లో ఉన్న రజక కళ్యాణ మండపంలో రజక చైతన్య సంస్థ మహాసభ జరిగింది…
ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరైనారు
ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోండా ఉమా మాట్లాడుతూ:- రజకులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి చైతన్య పూరితమైన కులస్తులు అని, 2014లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి నేడు మరోకమారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి రజకులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు
ఈ రజక చైతన్య సంస్థ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజానీకానికి నేను ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి మంచి పనులు అన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా పనిచేస్తున్నారని మా సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో పెద్ద ఎత్తున బీసీలు ఉంటే, బీసీలలో మొదటి స్థానం రజకులు ఉన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు
రాష్ట్రవ్యాప్తంగా ఏడు 7% జనాభా కలిగిన రజకులు వారు అడిగే న్యాయమైన కోరికలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు, వారు అనేక ఏళ్ల నుండి రజకులు అందరినీ SC లలో చేర్చాలి అని కోరిక సమ్మతమేనని, కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నందున రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో దీనిపై మాట్లాడి సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకొని వస్తానని తెలిపారు..
అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని పాడైపోయిన ధోబి కానాలను తక్షణమే, మరమ్మత్తులు చేసి వృత్తిదారులు అందరిని ప్రోత్సహించడంతోపాటు వారికి అవసరమైన, ఇస్త్రీ బల్లను, ఇస్త్రీ పెట్టెలను ఏర్పాటు చేయిస్తామని వారికి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు ఆదరణ పథకం, బీసీ లోన్లు, రజకులకు వృత్తిపరమైనట్టు పరికరాలను అందిస్తామని తెలిపారు, ఈ సందర్భంగా నూతనముగా రజక చైతన్య సంస్థ ఎంపిక కాబడిన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, డివిజన్ ఇంచార్జి నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ వీరమాచినేని లలిత, ఉపాధ్యక్షులు భవిరి సింహాచలం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్, రజక చైతన్య సేవా సంస్థ అర్బన్ అధ్యక్షులు కొండపల్లి రూప్ కుమార్, వాల్తేరు దుర్గాప్రసాద్, మల్లంపల్లి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు