రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ పశ్చిమ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రంగంలోకి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

Spread the love

 రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 

పశ్చిమ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రంగంలోకి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

 

పశ్చిమలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడు లోని ఆర్కోణం నుంచి వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక బస్సుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. టీం కమాండర్ సంకేత్ గైక్వాడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్నామన్నారు. సోమవారం సాయంత్రానికి 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎకె చౌహన్, సెకండ్ ఐ సి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ సేవలను అందించారు. వేగవంతంగా సేవలను అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *