యువ మేధ‌కు చుక్కాని.. ఆర్‌టీఐహెచ్‌

Spread the love

ఎన్‌టీఆర్ జిల్లా, న‌వంబ‌ర్ 10, 2025

యువ మేధ‌కు చుక్కాని.. ఆర్‌టీఐహెచ్‌

  • యువ పారిశ్రామిక‌వేత్త‌ను ప్రోత్స‌హించే స‌రికొత్త చొర‌వ‌
  • కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చేయిప‌ట్టి న‌డిపిస్తున్న హ‌బ్‌
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

యువ మేధ‌స్సుకు చుక్కాని ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ (ఆర్టీఐహెచ్‌) అని.. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను చేయిప‌ట్టి న‌డిపించేందుకు, స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఈ హ‌బ్‌, స్పోక్ ద్వారా స‌రికొత్త చొర‌వ చూప‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఆర్‌టీఐహెచ్ ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేయ‌గా.. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రులు సంద‌ర్శించారు. అయిదు స్టార్ట‌ప్‌ల వ్యాపార న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా.. ఆయా స్టార్ట‌ప్‌ల ప్రస్తుత స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల రాష్ట్రాన్ని వేదిక‌గా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన ఆర్‌టీఐహెచ్ హ‌బ్‌, స్పోక్‌లు విశేషంగా కృషిచేస్తున్నాయ‌ని.. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హ‌బ్ కార్య‌క‌లాపాలు, అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

Loading