Home Andhra Pradesh యువతకు నైపుణ్యాభివృద్ది లో శిక్షణ అందిస్తాం ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగేలా ఉద్యోగావకాశాల కల్పన- బూరుగుపల్లి...

యువతకు నైపుణ్యాభివృద్ది లో శిక్షణ అందిస్తాం ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగేలా ఉద్యోగావకాశాల కల్పన- బూరుగుపల్లి శేషారావు, చైర్మన్,

2
0

విజయవాడ, తేదీ: 05.06.2025• యువతకు నైపుణ్యాభివృద్ది లో శిక్షణ అందిస్తాం ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగేలా ఉద్యోగావకాశాల కల్పన- బూరుగుపల్లి శేషారావు, చైర్మన్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ రాష్ట్రంలో అర్హులైన ప్రతి యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు సాగేలా చేయడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) లక్ష్యమని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) చైర్మన్ గా బూరుగుపల్లి శేషారావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ శేషారావు మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ కు అనుగుణంగా, ప్రభుత్వ, పరిశ్రమ మరియు విద్యా రంగాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలు, గ్రామీణ యువత కోసం డిజిటల్ ఇంటర్న్ షిప్ మొదలైన కార్యక్రమాలను అమలు చేయనున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాహిత పాలన విధానం, ఈ సంస్థ పనితీరుకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. వారి మార్గనిర్ధేశత్వంలో పనిచేస్తూ, యువతకు శిక్షణను అందించుట ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమానత్వాన్ని కల్పించే లక్ష్యంతో మహిళలు, గ్రామీణ యువత మరియు టెక్నాలజీకి దూరంగా ఉన్నవారందరికి ఇంటింటికీ నైపుణ్యం తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ శేషారావును వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ది సంస్థ ఎండీ మరియు సీఈవో జీ. గణేష్ కుమార్, కార్యనిర్వాహక సంచాలకులు (ED), సలహాదారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు మరియు విద్యా రంగానికి చెందిన ప్రముఖులు అభినందించారు. జారీ చేసినవారు: సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here