మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.11-11-2025.

మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబ్దుల్ కలాం అజాద్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్. ఈ రోజు ది:11-11-2025 తేదీన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మౌలానా అబ్దుల్ కలాం అజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, స్మరించుకోవడం జరిగింది. అనంతరం డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్ కృష్ణ కాంత్ పాటిల్ ఐ.పి.ఎస్. నివాళులు అర్పించి, స్మరించుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ… మన దేశంలో విధ్యా అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి “అబుల్ కలాం ఆజాద్” ఆయన జన్మదినం సందర్భంగా నవంబర్ 11న మన దేశంలో “జాతీయ విద్యా దినోత్సవాన్ని” జరుపుకుంటున్నామన్నారు. ఈయన విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న‘ ఇచ్చి గౌరవించిందని, 2008 సం నుండి భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతుందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్యనాయకులలో ఒకరని, ప్రఖ్యాత పండితుడు, కవి అని, అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు అని, భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు డిప్యూటీ పోలీసు కమిషనర్ కృష్ణ కాంత్ పాటిల్ ఐ.పి.ఎస్, సి.ఎస్.బి., సి.సి.ఆర్.బి., సి.పి.ఓ.అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Loading