మొగల్రాజపురం లోని MLA బొండా ఉమామహేశ్వర ఇంటి వద్ద 24వ డివిజన్ కస్తూర్బాయ్ పేట, Y.దుర్గ,దమరల నరసమ్మ,జోగు కవిత లకు చిరు వ్యాపారం నిమిత్తం P4 పథకంలో భాగంగా 3 తోపుడు బండ్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందించారు…

Spread the love

ధి:10-11-2025 సోమవారం ఉదయం 9:00″గం లకు ” మొగల్రాజపురం లోని MLA బొండా ఉమామహేశ్వర ఇంటి వద్ద 24వ డివిజన్ కస్తూర్బాయ్ పేట, Y.దుర్గ,దమరల నరసమ్మ,జోగు కవిత లకు చిరు వ్యాపారం నిమిత్తం P4 పథకంలో భాగంగా 3 తోపుడు బండ్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందించారు…

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:-NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సమాజంలోని పేద వర్గాలకు మరియు చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం తిరిగి వచ్చింది అని, ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది అని, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు, ‘పీ ఫోర్’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వంటి సమాజంలోని ఉన్నత వర్గాల వారిని మార్గదర్శకులుగా నియమించి, ఆర్థికంగా వెనుకబడిన, బంగారు కుటుంబాలు ఎంపిక చేసి వారికి సహాయం అందించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం అని…

ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తన సొంత నిధులతో మరియు వ్యక్తిగత చొరవతో నియోజకవర్గం లోని 9 డివిజన్ లలో నివసిస్తున్న పేదలందరికీ, పెళ్లిళ్లకు, మరణాలకు, చదువులు వంటి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు…

నిత్యం తాము, పార్టీ కార్యకర్తలు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి అవసరమైన సహాయాన్ని అందించి, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేస్తాము అని, P4 పధకం లో భాగంగా ముఖ్యంగా, చిన్న వ్యాపారులకు ఉచితంగా తోపుడు బళ్లను అందించి, వారి వ్యాపార కార్యకలాపాలకు ప్రోత్సాహం అందిస్తు, వారికీ బ్యాంకుల్లో ఎటువంటి గ్యారంటీ లేకుండా కేవలం ఆధార్ కార్డుపై రూ. 15,000 లోన్ ఇప్పిస్తు, ఆ లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే, మళ్ళీ రూ. 25,000, ఆపై రూ. 50,000 వరకు కూడా లోన్ పొందే విధంగా చూస్తున్నామని…

తద్వారా వారు అధిక వడ్డీల బారిన పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా ఉంటున్నామని, ఇది వారి వ్యాపార విస్తరణకు ఎంతగానో తోడ్పడుతుంది అని, అలాగే, వారికి వ్యాపారం చేసుకోడానికి అనుకూలమైన జోన్లను కేటాయించి, అవసరమైన సదుపాయాలను కల్పిస్తాం. స్ట్రీట్ వెండర్స్‌కు అధికారికంగా లైసెన్సులు కూడా ఇస్తాం, తద్వారా వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అని…

అన్ని రకాలుగా పేదలు మరియు చిన్న వ్యాపారులకు అండగా నిలబడి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేస్తాం. ఇది వారి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, తాను 2024 లో శాసనసభ్యుడైన తర్వాత, దాదాపు 300 బళ్లు, స్త్రీ బండ్లు, తోపుడు బళ్లను పంపిణీ చేయడం జరిగింది, ఇది ఒక నిరంతర ప్రక్రియ, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, మరింత మందికి సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో:- బత్తుల అప్పారావు ,గుడేటి మురళి, గాజుల రాజు, గాజుల రవి,గడ్డం రాజు, దమర్ల రామమూర్తి, ములగడం రామకృష్ణ,దుర్గ,రమణకుమారి తదితరులు పాల్గొన్నారు

Loading