మొంథ తుఫాను నేపథ్యంలో విస్తృతమైన చర్యలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
28-10-2025

మొంథ తుఫాను నేపథ్యంలో విస్తృతమైన చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

మొంథ తుఫాను నేపథ్యంలో విస్తృతమైన చర్యలు చేపట్టామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

నగరంలో 41 పునరవాస కేంద్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా అందులో వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు అన్ని కల్పిస్తున్నామని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 146 మందికి భోజన సౌకర్యాలు కల్పించామని అన్నారు.

లోతట్టు, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆటోల ద్వారా మైక్ ల ద్వారా నిరంతరాయంగా సురక్షితమైన ప్రదేశాలకు తరలించేందుకు అవగాహన కల్పిస్తున్నామని, మరోవైపు ప్రజలకు ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా నగర పరిధిలో గల ప్రమాదకరమైన 60 వృక్షాలను, హోర్డింగ్లను, తొలగించామని అందులో భాగంగా 243 హోర్డింగ్లు, పాత భవనాల్లో నివసిస్తున్న 49 కుటుంబాలకు సురక్షితమైన ప్రదేశాలకు తరలించామని, ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తున్న 102 కుటుంబాలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించమని అన్నారు.

నగర పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి భంగం వాటిల్లకుండా సోమవారం రాత్రి కంపాక్టర్ బిన్లు అన్నిటినీ శుభ్రపరిచారని, చౌకింగ్ పాయింట్లలో వ్యర్ధాలను తొలగించేందుకు అదనంగా 100 పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశారని, పునరావస కేంద్రాలలో ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అదనంగా మలేరియా సిబ్బందిని పెట్టి ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నగర పరిధిలో గల డ్రైన్ల లో డీసిల్టింగ్ ప్రక్రియను 20 జెసిబి లతో 9 లాంగ్ ఆర్మ్ తో , ప్రత్యేక సిబ్బంది తో వేగవంతంగా చేయిస్తున్నారని, నీటి నిల్వలు ఉన్నచోట 13 పంపు సెట్లు, 78 ఆయిల్ ఇంజెన్తో మోటార్లు, 28 గుల్ఫేర్ లు, 29 ట్రాక్టర్ల సహాయం తో తొలగిస్తున్నారని, నగర పరిధిలోగల 13 ప్రమాదకరమైన విద్యుత్ స్తంభాలను మార్చారని కమిషనర్ తెలిపారు. నగర పరిధిలోని 41 రిహాబిలిటేషన్ సెంటర్ అన్నిటిలోనూ తీసుకోవాల్సిన సురక్షితమైన అగ్నిమాపక చర్యలను, వియంసి ఫైర్ వింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడున్న సిబ్బందికి సురక్షితమైన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారని కమిషనర్ తెలిపారు.

Loading