
తేదీ:01-11-2025
అమరావతి
మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి సీఎం చేతుల మీదుగా అభినందన కార్యక్రమం
మంత్రి కందుల దుర్గేష్ ను సన్మానించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఉండవల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుర్గేష్ ను సైక్లోన్ మొంథా ఫైటర్ గా గౌరవిస్తూ మెమొంటో తో పాటు సన్మాన పత్రం అందజేత
సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైందని, మొంథా తుఫాన్ ఎదుర్కోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో భాగంగా అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా శనివారం ఉండవల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో సైక్లోన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా పనిచేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి దుర్గేష్ ను సైక్లోన్ మొంథా ఫైటర్ గా గౌరవిస్తూ మెమొంటోతో పాటు సన్మాన పత్రం అందించారు.
తుఫాను సమయంలో ప్రదర్శించిన అంకితభావం, నాయకత్వం, ప్రజలను సంసిద్ధులను చేయడం, సహాయక చర్యలలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా సహచర మంత్రులతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కు సీఎం చంద్రబాబు నాయుడు సన్మాన పత్రం అందించారు. ఇలాంటి విపత్కర సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిబద్ధతతో ప్రజా సేవ అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్ సేవలను సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడుతూ హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆర్టీజీ సెంటర్ నుంచి రియల్ టైమ్‌లో పర్యవేక్షణ చేయడం, రక్షణ, సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో టెక్నాలజీ వినియోగించడం, ప్రభుత్వ ముందస్తు చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడం, అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం, తుఫాను తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకురావడం, సమస్యలకు తగు పరిష్కారం చూపడంలో సీఎం చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ చూపించారని తెలిపారు. సమర్థ పాలనలో సమిష్టి కృషి వల్లే మొంథా తుఫాన్ ను దీటుగా ఎదుర్కొని విజయం సాధించామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రకృతి విపత్తును నివారించే అవకాశం లేదు కాబట్టి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేశారని వారందరి కృషి వల్లే ఈ అవార్డు సాధ్యమైందని మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొంథా తుఫాన్ ఎదుర్కోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.
![]()
