
మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది.
M.P కేశినేని చిన్ని MLA సుజనా చౌదరి ఆదేశాలతో
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 52 వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండచరియలు రాళ్ళు పడే అవకాశం ఉంటుందని వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాలుకు వెళ్లాలని,ఏదైనా విపత్కర పరిస్థులు వస్తె వెంటనే కార్పొరేటర్ ఉమ్మడి వేంకటేశ్వర (చంటి) కి సమాచారం ఇవ్వ వలెనని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఏర్పాటు చేస్తుందని డివిజన్ లోని కొండ ప్రాంతంలో ఇంటింటికి పర్యటించి ప్రజలకు తెలియచేయడం జరిగింది.
ప్రజలు, ప్రభుత్వానికి సహకరిస్తూ, అధికారులు ఇచ్చే సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వేంకటేశ్వర చంటి డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ శివరావు సెక్రటరీ గోలి శ్రీనివాస రావు మున్సిపల్ ఇనస్పెక్టర్ రాజు, కోసూరి నూకరాజు,నరసింహారావు, మరియు కూటమి నాయకులు మున్సిపల్ సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది.
![]()
