జర్నలిస్టులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలి
- మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు
- ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు .
గొల్లపూడి, జూలై 30: జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజా హితమే లక్ష్యంగా పనిచేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచించారు.
గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయులకు ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ లో పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు.
జర్నలిస్టులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ని కార్యవర్గ సభ్యులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
గౌరవాధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు , నూతన అధ్యక్షుడు పి.గిరి కుమార్, కార్యదర్శి బి.డేవిడ్ రాజు , కోశాధికారి పి.రాంబాబు ఉపాధ్యక్షుడు ఎన్.సురేష్ గా లను ఎమ్మెల్యే సత్కరించారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు హఫీజ్ ఖాద్రీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్.కె.బాషా , కార్యవర్గ సభ్యులు ఎస్.నాగరాజు సిహెచ్.మురళి ఆర్.క్రాంతి కుమార్ యు.ఆదాం తదితరులు పాల్గొన్నారు.