మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూడబోను అండగా ఉంటా-పని చేసి చూపుతా

4
0




మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూడబోను

అండగా ఉంటా-పని చేసి చూపుతా

ముస్లిం సంఘాల నేతలకు సుజనా హామీ

సుజనాకు మద్దతు ప్రకటించిన మైనారిటీ నేతలు

మైనారిటీలను తాను ఓటు బ్యాంకుగా చూడబోనని, వారిలో ఒకడిగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని ముస్లిం సంఘాల నేతలు కలుసుకున్నారు. సుజనాను అభినందించారు. వారికి మద్దతు ప్రకటించారు.  ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం చేపట్టబోయే కార్యాచరణను సుజనా వివరించారు. ప్రతి డివిజన్ లో  కార్యాలయం ఏర్పాటు చేసి. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. మైనారిటీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పించే  చర్యలు తీసుకుంటామని, ప్రతిభ ఉన్న మైనారిటీ విద్యార్దులు ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని  భరోసా ఇచ్చారు.  తాను మాట తప్పి పని చేయకపోతే ఎవరైనా ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లిం,, క్రిస్టియన్, ఎండోమెండ్ ఆస్తులను కాపాడతామన్నారు. గత అయిదేళ్ళలో అబద్ధాలు, అసత్యాలను ప్రజలు నమ్మి ఎన్నో ఇబ్బందులు పడ్డారని వివరించారు.  తనను గెలిపిస్తే, పని చేసి చూపిస్తానన్నారు.  ఆర్ధికంగా ఎదిగి ఆదర్శంగా నిలిచేలా ముస్లిం సమాజానికి అండగా ఉంటామని సుజనా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా,  పలువురు మైనారిటీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here