మేలు చేశాను చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదు. సామినేని ఉదయభాను అన్నారు

Spread the love

 మేలు చేశాను చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదు.

నేను మీకు మేలు చేశాను.. నాకు ఓటేయమని అనే అడిగే దమ్ము చంద్రబాబుకు లేదని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు

జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం తాళ్లూరు, మాచినేనిపాలెం గ్రామాల నందు ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.

ఈ సంద్భంగా ఉదయభాను  మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాదని హామీలను గుప్పిస్తున్నారని అన్నారు. ప్రజలు మోసపోతే ఇప్పుడు వస్తున్న పథకాలు అన్ని కోల్పోవడం జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ప్రజలకు నేను ఇది చేశాను అనే చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదు అన్నారు. మరో వైపు తమ కుటుంబాలకు మేలు జరిగితేనే ఓటు వెయ్యమన్న మొనగాడు జగనన్న అని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం కబ్బటే ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా ఓటు అడుగుతున్నాం అని అన్నారు. జగనన్న నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారిని హక్కునా చేర్చుకున్నారు అని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అ అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *