మెరుగైన వైద్యం కోసం
ఎల్. ఓ .సీ అందజేత
మెరుగైన వైద్యం కోసం కూటమి నేతలతో కలిసి ఎల్.ఓ.సీ ను అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి ను
(లెటర్ ఆఫ్ క్రెడిట్) సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
51వ డివిజన్ వాగు సెంటర్ కు చెందిన కటకం నరసింహ కుమార్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతడికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా బీజేపీ సీనియర్ నేత బోయపాటి నాని చౌదరి ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం కోసం దరఖాస్తు చేశారు.
వారికి
రూ 8 లక్షల ఎల్.ఓ.సీ ను ఎన్డీఏ కూటమినేతల తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు.
త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుడి కుటుంబ సభ్యులు
కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గన్నవరపు శ్రీనివాస్, దివ్వెల రామాంజనేయులు, భూదాల నందకుమారి , సప్పా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..