
మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓసీ అందజేత..
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్ ) ఎల్ ఓసీ ను మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో తో కలిసి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు
41 వ డివిజన్, ప్రెసిడెంట్ వీధికి చెందిన సయ్యద్ ఖాజా భాష ( 50) క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు ..
మంజూరైన రూ 5 లక్షల 25 వేల ఎ .ల్. ఓ .సీ ను బాధితుడి సోదరుడికి అందజేశారు
త్వరితగతిన స్పందించి ఎల్ ఓసీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కూటమి నేతలు వేంపలి గౌరీ శంకర్ , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..
![]()
