మెరుగైన వైద్యం కోసం ఎల్.ఓ.సీ అందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి షైన్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న భోగాది శివ మనోజ్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఎల్.ఓ.సి లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని అందజేశారు. కామకోటి నగర్ కు చెందిన శివ మనోజ్ (24) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి అత్యవసర చికిత్స పొందుతున్నాడు మెరుగైన చికిత్స కోసం బాధితుడి కుటుంబ సభ్యులు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రూ 4 లక్షల 44 వేల ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కూటమి నేతలు వెంపలి గౌరీ శంకర్, పచ్చవ మల్లికార్జున, ప్రదీప్ రాజ్, తేజ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.