మెరుగైన వైద్యం కోసంఎన్డీఏ కార్యాలయంలోఎల్. ఓ.సీ అందజేత

3
0

మెరుగైన వైద్యం కోసం
ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్. ఓ.సీ అందజేత

కూటమి నేతలతో కలిసి అందించిన
ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
ఎల్. ఓ. సీ.( లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

44వ డివిజన్ కు చెందిన
దుర్గా దేవి (43) గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో బీజేపీ నాయకులు రెడ్డిపల్లి రాజు ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
రూ 1 లక్ష 80 వేల ఎల్.ఓ.సీ మంజూరు కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు

అదేవిధంగా కొత్తపేటకు చెందిన సరగడ చరణ్ (4) హృద్రోగం తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా
రూ 2 లక్షల 58 వేల ఎల్. ఓ. సీ ను బాధితుడి తల్లితండ్రులకు అందజేశారు.

త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కూటమి నేతలు రెడ్డి పల్లి రాజు , గన్ను శంకర్ మైనంపాటి రమేష్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు దొడ్ల రాజా, కొల్లి దుర్గారావు, సప్పా శ్రీనివాస్, శ్రావణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here