మెప్పా, డ్వాక్రా సంఘాలు సీఎం చంద్ర‌బాబు మాన‌స పుత్రిక‌లు : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

1
0

28-06-2025

మెప్పా, డ్వాక్రా సంఘాలు సీఎం చంద్ర‌బాబు మాన‌స పుత్రిక‌లు : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

మెప్పాలో ప‌నిచేసే రిసోర్స్ ప‌ర్స‌న్స్ కు ట్యాబ్ లు అందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

విజ‌య‌వాడ న‌గ‌రంలో 500 ఆర్.పిల‌కు ట్యాబ్ లు అందించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా

సింగ్ న‌గ‌ర్ లో డ్వాక్రా బ‌జార్ ఏర్పాటు కోసం స్థ‌ల ప‌రిశీల‌న

జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి

ప్ర‌భుత్వానికి డ్వాక్రా సంఘాల‌కు ఆర్.పిలు వారిధి

సొంత నిధుల‌తో కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్, స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్, మార్కెటింగ్ స‌దుపాయం

విజ‌య‌వాడ : మెప్పా, డ్వాక్రా సంఘాలు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మాన‌స పుత్రిక‌లు. డ్వాక్రా మ‌హిళ‌ల‌ను అభివృద్ది ప‌రిస్తే… ప్ర‌తి ఇంట్లో ఒక వ్యాపార‌వేత్త‌ను తయారు చేయాల‌న్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌యం త్వ‌ర‌గా సాధ్య‌మ‌వుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు.

విజ‌య‌వాడ తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ స్లం స‌మాఖ్య రిసోర్స్ ప‌ర్స‌న్స్ కు ట్యాబ్ ల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌నివారం న‌గ‌రంలోని ఐ.వి ఫ్యాలెస్ లో జ‌రిగింది. మెప్పా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ట్యాబ్ ల పంపిణీ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్,ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా 500 మంది ఆర్.పిల‌కు 35 వేల రూపాయ‌లు విలువ చేసే ట్యాబ్ లు ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వానికి డ్వాక్రా సంఘాల‌కు ఆర్.పిలు వార‌ధిగా వున్నారంటూ వారి సేవ‌ల‌ను కొనియాడారు. సీఎం చంద్ర‌బాబు ప‌నులు వేగవంతంగా అయ్యేందుకు స‌మూలంగా డిజిటిలైజేష‌న్ కోసం మార్పులు చేస్తున్నార‌ని, అందులో భాగంగానే ఆర్.పి ల‌కు ట్యాబ్ లు అందించ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ప‌ట్ట‌ణ పేదరిక నిర్మూలిన సంస్ధ మెప్పా విభాగం ద్వారా డ్వాక్రా సంఘాల అభివృద్ది కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ కోసం ప‌నిచేస్తున్న రిసోర్స్ ప‌ర్స‌న్ ల‌కు దిశా నిర్ధేశం చేశారు.

ప్ర‌జ‌ల దైనందిన జీవితంలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన విష‌యాలు ఆల‌స్యంగా కాకుండా త్వ‌రిత‌గ‌తిన ప్ర‌భుత్వానికి తెలియ‌జేయ‌టం కోసం, ఆ విష‌యాల‌ను త‌క్ష‌ణం అమలు చేయ‌టం కోసం ఈ డిజిటలైజేష‌న్ ప్ర‌క్రియ సీఎం చంద్ర బాబు ప్రారంభించార‌ని తెలిపారు.

డ్వాక్రా మ‌హిళ‌లు సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్, కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ త‌మ సొంత నిధుల‌తో ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. చాలా మంది రుచిగా, శుచిగా ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తారు కానీ ప్యాకింగ్ బాగోదు..కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్ లో ప్యాకింగ్ ఏర్పాటు చేయ‌టంతో పాటు ఉచితంగా మార్కెటింగ్ స‌దుపాయం ఏర్పాటు చేస్తామ‌న్నారు. స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్, కామ‌న్ ఫెసిలిటీ, మార్కెటింగ్ ఈ మూడు కూడా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అందించ‌గ‌లిగితే అభివృద్ది సాధించ‌టమే కాదు…మ‌హిళ సాధికార‌త సాధిస్తార‌న్నారు. ఆ త‌ర్వాత కుటుంబానికో వ్యాపార‌వేత్త త‌యారు చేయ‌టం సులువుగా మారుతుంద‌న్నారు.

ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఉచితంగా మార్కెటింగ్ స‌దుపాయం క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక సిద్దం చేశార‌ని, సింగ్ న‌గ‌ర్ లో డ్వాక్రా బ‌జార్ ఏర్పాటు కోసం స్థ‌ల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌న్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు, ఇబ్ర‌హీంప‌ట్నం నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట జాతీయ ర‌హ‌దారుల‌పై డ్వాక్రా బ‌జార్లు ఏర్పాటు చేసే విష‌యం క‌లెక్ట‌ర్ తో చ‌ర్చించ‌టం జ‌రిగింద‌న్నారు. డ్వాక్రా బ‌జార్లు లో రోటేష‌న్ ప‌ద్ద‌తిలో నాలుగైదు రోజుల పాటు ఉచితంగా ప్రొడ‌క్ట్స్ అమ్ముకునే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఈ బజార్లో అర‌కు కాఫీ తోపాటు, కొండ‌ప‌ల్లి బొమ్ములు కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ జ‌నాభాలో స‌గం పైన వున్న మ‌హిళ‌లకు అండ‌గా వుండాల‌నేది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌యమ‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు అధికారంలో వున్నా మ‌హిళ‌లకు ఆర్థిక‌, విద్య‌, సామాజిక ప‌రంగా అన్ని విధాలుగా అండ‌గా వుంటున్నార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌హకారంతో డ్వాక్రా బ‌జార్ ఏర్పాటుకు కృషి చేస్తాన‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మెప్పా పి.వో వెంక‌ట నారాయ‌ణ‌, జిల్లా అర్బ‌న్ మ‌హిళ స‌మాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి, కోశాధికారి కె.త్రివేణి , ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల‌స్వామి,49వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ బుల్లా విజ‌య్, టిడిపి నాయ‌కులు వి.న‌ర‌సింహా చౌద‌రి, మాదిగాని గురునాధం ల‌తో పాటు మెప్పా టి.ఈలు, సి.డి.వోలు, ఎస్.డ‌బ్ల్యూ, సి.వో లు , సి.ఎల్.ఆర్.ఎపిలు, ఆర్.పి లు, టి.ఎల్.ఎప్‌.ఓ.బి లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here