మెగా డీఎస్సీ విజేతల సన్మాన కార్యక్రమం – నందిగామ నియోజకవర్గంలో చారిత్రక ఘట్టం

Spread the love

మెగా డీఎస్సీ విజేతల సన్మాన కార్యక్రమం – నందిగామ నియోజకవర్గంలో చారిత్రక ఘట్టం

నందిగామ, సెప్టెంబర్ 30:

రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులలో నందిగామ నియోజకవర్గం నుంచి 69 మంది విజేతలు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా నందిగామలోని పాత బస్టాండ్ సెంటర్ బాబు జగజీవన్ రావు భవనంలో 55 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.రాష్ట్రంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో ఈ తరహా కార్యక్రమం జరగడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం ద్వారా వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపారు.

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ కేవలం 15 నెలల వ్యవధిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డీఎస్సీపై తొలి సంతకం చేసి,ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

15 సంవత్సరాల పాలనలో 12 సార్లు డీఎస్సీ నిర్వహించి దాదాపు 2 లక్షల మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన చంద్రబాబు సేవలు ఆజన్మంతం గుర్తుంచుకోవాల్సినవే. ఈ మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ఇది వారి వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడడమే కాక, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తూ, నందిగామ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి,కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నేతలు, నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *