ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

 NTR జిల్లా / నందిగామ టౌన్ 

ది.17-06-2024(సోమవారం) 

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 

ముస్లింల త్యాగనిరతికి ప్రతీక బక్రీద్‌ (ఈద్ – అల్- అదా) : Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 

జామా మసీదులోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 

నందిగామ పట్టణంలోని అశోక్ నగర్ ఈద్గా వద్ద “ఈద్ అల్ అదా” పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారుప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ… ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని వీడి త్యాగాలకు సిద్దపడినప్పుడే సమాజ హితం సాధ్యామవుతుందని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్ధకత అనే సందేశాన్ని బక్రీద్‌ పండుగ విశ్వ మానవాళికి అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  తెలిపారు. బక్రీద్‌ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తున్నదని అన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని… అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  తెలిపారు 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *