1/7/2025
మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ( వెహికల్ డిపో మెకానికులు, పార్క్ సెక్షన్, వాటర్ ,స్ట్రీట్ లైటింగ్ ,టౌన్ ప్లానింగ్) కార్మికుల యొక్క జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరవధిక సమ్మె ఏడవ రోజు ధర్నా చౌక్ లో వెహికల్ డిపో మెకానిక్లు పనిచేసే పనిముట్లు పని స్వభావంతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో 700 చెత్తను తరలించే వాహనాలు 24 గంటలు రిపేర్ చేస్తూ చేత్త బళ్ళు ఎక్కడ ఆగిన గాని టైరు పంచరైన రిపేరుతో ఆగిన రోడ్లమీద టన్నుల చెత్తతో ఉన్న బల్ల కింద దూరి రిపేరు చేసి వెంటనే చెత్త బళ్లను పంపించే ఏర్పాట్లు చేసే మెకానిక్ల జీతాలు మాత్రం ప్రభుత్వం పెంచకపోవడం చాలా దారుణమని ఈ బళ్ళు ల్లో కూడా చెత్త తరలించే బళ్ళు డ్రైనేజీ తరలించే బళ్ళు స్లీపింగ్ మిషన్లో, బళ్ళు ఇలా చెత్తను తరలించే చిన్న బళ్ళు దగ్గర నుండి పెద్ద బళ్ళు వరకు రిపేరు చేస్తున్నారు కానీ వాళ్ల జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం ముందు అడుగు వేయకపోవడం కనీసం ఆలోచన చేయకపోవడం కూడా దౌర్భాగ్యమని అందుకనే తప్పని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సమ్మెలోకి దిగారని జీతాలు పెరిగేదాకా మా ఈ పోరాటం ఆగదని అవసరమైతే ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా పారిశుద్ధ కార్మికులను కూడా మద్దతుగా సమ్మెలోకి దించుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఎస్.జ్యోతి బస్సు నగర కోశాధికారి డి స్టీఫెన్ బాబు, వెహికల్ డిపో మెకానిక్ సెక్షన్ బాధ్యులు దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు, బాబురావు, పార్క్ సెక్షన్ బాధ్యులు టీ చిన్న ,వెంకట్రావు, కుమారి, స్వరూప, వాటర్ సెక్షన్ బాధ్యులు దుర్గారావు, నారాయణ, నల్ల శీను, సైదులు,నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టీ ప్రవీణ్,j. విజయ లక్ష్మీ, సేలం దాసు, వి. సాంబులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు