ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి రూ. 10 లక్షల చెక్ అందజేత

Spread the love

 నంద్యాల జిల్లా/నందికొట్కూరు

ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి రూ. 10 లక్షల చెక్ అందజేత

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం నిన్న రూ. 10 లక్షల పరిహారం చెక్కును అందించింది. నిన్న గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్ అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున పరిహారం అందించామని, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తామని తెలిపారు. బాధిత తల్లికి ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *