ముగిసిన అసెంబ్లీ సమావేశాలు – 27.22 గంటల పాటు సభా నిర్వహణ: స్పీకరు అయ్యన్నపాత్రుడు

Spread the love

 అమరావతి

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు – 27.22 గంటల పాటు సభా నిర్వహణ: స్పీకరు అయ్యన్నపాత్రుడు

16వ శాసనసభ మొదటి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మొదటి విడత సమావేశాలు జూన్‌ 21, 22 తేదీలు, రెండో విడత సమావేశాలు ఈ నెల 23 నుంచి 26 వరకు మొత్తం ఆరు రోజులు నిర్వహించినట్లు శాసనసభ స్పీకరు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే సభా నిర్వహణకు సంబంధించి గణాంకాలను విడుదల చేశారు. మొత్తమ్మీద సభ 27 గంటల 22 నిమిషాలు నడిచిందని తెలిపారు. మౌఖికంగా సమాధానం చెప్పిన స్టార్‌ ప్రశ్నలు 36, సభలో సమాధానం ఇవ్వబడిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు 1, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు 3, ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య 2, ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య 2, ప్రసంగాలు 68 మంది, 344వ నియమం కింద చర్చ ఒక ప్రశ్న నడిచిందని స్పీకరు వెల్లడించారు. సభలో రాజకీయ పక్షాల బలాబలాలు టిడిపి 135 మంది, జనసేన 21, వైసిపి 11, బిజెపి 8 మంది మొత్తం 175 మంది సభ్యులు అని స్పీకరు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *