ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

2
0

ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) తెలిపారు.

మంగళవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 61 మందికి రూ 33.98 లక్షలను 24 మందికి ఎల్. ఓ.సీ( లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలను) కూటమి నేతలతో కలిసి 85 మంది లబ్ధిదారులకు రూ 74 లక్షల 8 వేలను అందజేశారు.
ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన లో ఆర్థిక విధ్వంసం జరిగిందని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
వైసీపీ విధ్వంస పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల వరకే రాజకీయాలని ప్రజలకు సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులందరం ఐక్యంగా కలిసి పనిచేయాలన్నారు.
రాజకీయాలకతీతంగా, కులమతాలకతీతంగా చిత్తశుద్ధితో పశ్చిమ ప్రజలకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర కో ఆర్డినేటర్లను నియమించడం జరిగిందని ప్రతి ఒక్కరు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ప్రజలందరికీ ఎన్డీఏ కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
పశ్చిమ లోని కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు
ఓటు వేయని చివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందాలనేది తమ అభిమతమని ఎమ్మెల్యే సుజనా తెలిపారు.. ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసి పనిచేయించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, టీడీపీ సీనియర్ నేత కోగంటి రామారావు , కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు ,మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, మైలవరపు లావణ్య, కూటమి నేతలు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు , మైలవరపు కృష్ణ, పగడాల కృష్ణ, పీ వీ చిన్న సుబ్బయ్య, పచ్చవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, సారేపల్లి రాధాకృష్ణ, మంగళ పురి మహేష్ ,పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, సోమేశ్వరరావు, రెడ్డిపల్లి రాజు, గంగాధర్ , పోతిన భేసు కంటేశ్వరుడు, కే శివశర్మ, ఏలూరు సాయి శరత్,సుబ్బయ్య,
దాడి అప్పారావు, దాడి మురళీకృష్ణ, గడ్డిపాటి కిరణ్,దీటి ప్రభుదాస్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here