ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం :
గన్నవరం నియోజకవర్గంలోని ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ఓసి లను ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేశారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ మాజీ సర్పంచ్ వణుకురు జోజి అనారోగ్యానికి గురికాగా విజయవాడలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గన్నవరం మండలం అచ్చంపూడి గ్రామానికి చెందిన దుడ్ల నాగేశ్వరరావు విజయవాడలోని అను వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వీరిద్దరికీ మెరుగైన వైద్య చికిత్స అందించేందుకుగాను రోగుల కుటుంబ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ ను సంప్రదించగా సత్వరమే స్పందించిన యార్లగడ్డ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెరొక రూ.2.50 లక్షలు సాయం మంజూరు చేయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రోగుల కుటుంబ సభ్యులకు ఎల్ఓసి లను ఎమ్మెల్యే వెంకట్రావు అందజేశారు.