ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజల కోసమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

1
0

27.7.25
సంతబొమ్మాళి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజల కోసమే

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

వైకాపా పాలనలో దెబ్బతిన్న రాష్టాన్ని ఏడాదిలోనే గాడిన పెట్టాం

వైకాపా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు తాళం వేశారు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 97 పధకాలను రద్దు చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డమంత్రి

ఆర్థిక ఇబ్బందులున్నా హామీలన్నీ అమలు చేస్తున్నాం

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు

సంతబొమ్మాళి మండల పరిధిలో రూ. 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి

వడ్డివాడ వద్ద గరీబుల గెడ్డ నుంచి సాగు నీరు విడుదల చేసిన మంత్రి

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి మండలం వడ్డి వాడ, జొన్నలపాడు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
జొన్నలపాడు గ్రామ దేవత గుడి నుంచి స్మశాన వాటికకు అంచనా వ్యయం రూ.29 లక్షలు కాగా అందులో  రూ.18 లక్షలతో సిమెంట్ రోడ్లు , కాలువల నిర్మాణానికి , రూ .20 లక్షలతో నిర్మించిన అంతర్గత రోడ్లు,కాలువలు, ఎం.పి.పి.స్కూల్ నుండి బూర్ల కొండ వరకు రూ.73 లక్షలతో నిర్మించిన రోడ్లు, కాలువలను,వడ్డివాడ గరీబుల గడ్డపై గల క్రాస్ రెగ్యులేటరీ మరమ్మత్తులు, కాకరాపల్లి ఆధునీకరణ పనులను ప్రారంభించారు. వడ్డివాడ గ్రామంలో వాటర్ ట్యాంక్ నుండి రైస్ మిల్లు వరకూ రూ.25 లక్షలతో, జొన్నలపాడు గ్రామం లో అంచనా వ్యయం రూ.100 లక్షలతో,  రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు . వడ్డివాడ, జొన్నలపాడు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిరంతరాయంగా శ్రమిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తూ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తున్నారన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ దిశగా ఆలోచన చేస్తూ మరోవైపు పరిశ్రమలు నెలకొల్పి, నూతన పెట్టుబడులను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ లు, తల్లికి వందనం పథకాల ద్వారా తల్లులకు నగదును బదిలీ చేసి ప్రజల మన్నన పొందామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, ఈ ఏడాది ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాబోతుందని, త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ నగదు పడతాయని తెలిపారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న భవిష్యత్ తరాల కోసం ముఖ్యమంత్రి అభివృద్ధి బాటలు వేస్తున్నారన్నారు. పి4 కార్యక్రమంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పీఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్ , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రైతులు అండగా కూటమి ప్రభుత్వం

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండలం వడ్డివాడ వద్ద గరీబుల గెడ్డ నుంచి సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను
విస్మరించిందని, ఐదేళ్లలో రైతులకు
సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు, రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పంపిణీ కూడా ఐదేళ్లు చేయలేదని, ఏడాది పాలనలో రైతులకు అవసరమైన
యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేశామని చెప్పారు.

గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి

రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్లు అప్పుడు చేశారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 97 పథకాలను రద్దు చేశారని
విమర్శించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే పథకం జల శక్తి పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జల శక్తి పథకం మరో రెండేళ్లు పొడిగించడం జరిగిందని అన్నారు. ఐదేళ్లలో రైతుల ప్రయోజనాలను విస్మరించిందని, ఐదేళ్లలో రాయితీపై రైతులకు ఒక్క పరికరం కూడా ఇవ్వలేని అసమర్థ పాలన రాష్ట్రంలో సాగిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలు జలశక్తి పథకం
వినియోగించుకుందని వైకాపా ప్రభుత్వం, పథకాన్ని విస్మరించిందని అన్నారు.
స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే తొలి విడతగా రూ. 100 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఐదేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలని,
రాష్ట్రంలో ఇప్పటికే 800 డ్రోన్లు
పంపిణీ చేయడం జరిగిందని
డోన్ సహాయాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు ఒక్కొక్కటిగా
పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here