(రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పేషి కార్యాలయం అమరావతి)
07-08-2025)
అమరావతి
ముఖ్యమంత్రి కి హజ్ యాత్రికుల కృతజ్ఞతలు
24 గంటల్లో రూ.లక్ష రాయితీ చెల్లింపు పై హర్షం
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసిన విజయవాడ ఎంబార్కేషన్ యాత్రికులు
అమరావతి ఆగస్టు 7
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రంను ఎన్నుకుని, తక్కువ యాత్రికుల కారణంగా విజయవాడ నుండి విమాన సర్వీసు రద్దుతో హైదరాబాద్ నుండి హజ్ యాత్రను పూర్తి చేసి ప్రభుత్వ రాయితీ ని అందుకున్న యాత్రికులు సియం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముస్లిం మత పెద్దలు, సీనియర్ ఇమాములతో పాటు చేతిలో థ్యాంక్ యు సి. ఎం సార్ ప్లకార్డులు పట్టుకుని వారు కలిశారు.విజయవాడ ఎంబార్కేషన్ ఎన్నుకున్న హజ్ యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తమ కృతజ్ఞతలను తీసుకువెళ్లాలని మంత్రి ఫరూక్ ను వారు కోరారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎన్నుకున్న 72 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఇచ్చిన హామీ మేరకు రూ.72 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి 24 గంటల వ్యవధిలోనే బ్యాంక్ అకౌంట్లకు జమ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ 2026 హజ్ కి విజయవాడ ఎంబార్కేషన్ ఎన్నుకున్న వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. ఏపీ నుంచి హజ్ కు వెళ్లే వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.