ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపిన లోక్ సత్తా నాయకుడు సామాజిక కార్యకర్త తూనుగుంట్ల ఫణీంద్ర,

Spread the love

 ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపిన లోక్ సత్తా నాయకుడు సామాజిక కార్యకర్త తూనుగుంట్ల ఫణీంద్ర, 

 అమరావతి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాదించినందుకు శుభాభినందనలు తెలియజేసిన లోక్ సత్తా నాయకుడు, సామాజిక కార్యకర్త తూనుగుంట్ల ఫణీంద్ర, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫణీంద్ర మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రజలు మీ పై ఉంచిన నమ్మకంతో రాజకీయ కక్షసాధింపు చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ బలం మరింత అవసరం కాబట్టి ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలగకుండా రాష్ట్రానికి నిధులు తీసుకువస్తు నవ్యాంధ్ర నిర్మాణానికి అడుగులు వేస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలిలో ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రిని లోక్సత్త నాయకుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త తూనుగుంట్ల కోరారు. అదేసమయంలో ఫణీంద్ర మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో కూటమికి విజ్ఞతతో ప్రజలు ఓటు వేశారని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *