
అమరావతి,
తేదీ, 28,అక్టోబర్, 2025.
ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ
భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ఐటీ విదేశీ పెట్టుబడులు గూగుల్ సంస్థ నుంచి విశాఖపట్నంలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతిలో నిర్మాణాలు వేగవంతం కావడంపై ఆయన ముఖ్యమంత్రిని అభినందించానని ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిజమైన డబుల్ ఇంజన్ పాలన అందించిందని, ఆయన తెలిపారు.
విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్, భాజపా మీడియా ప్రతినిధి చిన్నపరెడ్డి రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.
![]()
