మీట్ అండ్ గ్రీట్ విత్ కేకే విజయవాడలో గ్రాండ్ సక్సెస్ కిక్కిరిసిన విజయవాడ ఐలాపురం ప్రాంగణం

Spread the love

 మీట్ అండ్ గ్రీట్ విత్ కేకే విజయవాడలో గ్రాండ్ సక్సెస్

కిక్కిరిసిన విజయవాడ ఐలాపురం ప్రాంగణం

కేకే ను సన్మానించడానికి పోటీ పడ్డ అభిమానులు

ప్రత్యేక ఆకర్షణగా సుజనా చౌదరి, కామినేని, కొనకల్ల

 ప్రతి మూడు నెలలకి నియోజకవర్గాలలో కేకేతో సర్వే.

 విజయవాడ

విజయవాడ, మంగళగిరి తో పాటు పలుచోట్ల… ‘MEET&GREET WITH KK’ ప్రోగ్రాం ద్వారా ఇంటరాక్టివ్ సెక్షన్స్ దీక్ష మీడియా ఏర్పాటు చేయగా అందులో భాగంగా..

శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఐలాపురం లో

ఏర్పాటుచేసిన కేకే సన్మాన సభకు దీక్ష మీడియా చైర్మన్ జొన్న రాజేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేన కే దక్కుతుందని చెప్పిన.. ఏకైక సంస్థ.. కేకే సర్వేస్ అని తెలిపారు… కేకే తో గత గత సంవత్సర కాలంగా ట్రావెల్ చేస్తున్నామని… ప్రీ పోల్స్ నుండి ఎగ్జిట్ పోల్స్ వరకు.. కేకే కు సంబంధించిన వీడియోలు దీక్ష మీడియా ప్రసారం చేసిందని అన్నారు.

దీక్ష మీడియా ఆధ్వర్యంలో ఇంట్రాక్టివ్ సెక్షన్స్… విజయవాడలోని ఐలాపురం తో పాటు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని శ్రీ ఫార్చున్ గ్రాండ్ లో గ్రాండ్గా జరిగాయని అన్నారు.

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో.. ఇంట్రాక్టివ్ సెక్షన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు.. కేకేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజన చౌదరి మాట్లాడుతూ అందరూ నివ్వెర పోయేలా.. సర్వే రిజల్ట్స్ ఇచ్చిన కేకే ని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి సంవత్సరం.. తన నియోజకవర్గంలో పాటు.. చుట్టుపక్కల నియోజకవర్గాలలో తమ పనితీరు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే… చేయాలని అనుకుంటున్నానని.కేకే సర్వే.. దీనిపై పరిశీలించి.. అంగీకరిస్తారని అనుకుంటున్నారని ఆకాంక్షించారు.

 జనసేన సెంట్రల్ జోన్ కన్వీనర్ బాధిత శంకర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే కేకే చేసిన ప్రాథమిక సర్వే ఆధారంగా..ఇండియా కూటమి గెలుస్తుందని బలంగా నమ్మామని  దీక్షా మీడియా అలాగే కేకేతో.. కలిసి ప్రయాణం చేయడం వలన ఇది సాధ్యమైందని… అన్నారు.

ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ.. కేకే జాతీయ స్థాయిలో సర్వేల నిర్వహించి.. ఆంధ్రప్రదేశ్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని.. ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు,మాజీ ఎంపీ కొనగల్ల నారాయణ, తానా మాజీ అధ్యక్షులు కోమిటి జయరాం, apuwj రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, apuwj రాష్ట్ర కమిటీ సభ్యులు గొర్లి రామారావు, iju నాయకులు మార్కండేయులు, కారు మంచి సునీల్ సందీప్, జనసేన నాయకులు గంజి పవన్, జనసేన,తెలుగుదేశం నాయకులు, కేకే అభిమానులు దీక్ష మీడియా టీం, దీక్ష మీడియా ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *