మా పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ మాకు ఇచ్చే వరకు నిరాహార దీక్ష విరామించబొమని ఆందోళనకు దిగిన FMG విద్యార్థులు

3
0

*N T R జిల్లా విజయవాడ
N T R యూనివర్సిటీ విద్యార్థులు రెండవ రోజు కూడా కొనసాగించిన నిరాహార దీక్ష

మా పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ మాకు ఇచ్చే వరకు నిరాహార దీక్ష విరామించబొమని ఆందోళనకు దిగిన FMG విద్యార్థులు*

APMC రిజిస్టర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం

FMG విద్యార్థులు నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ

గత ఒకటిన్నర సంవత్సరం నుండి ఏపీఎంసీ చుట్టూ తిరుగుతూ మా సమస్యను పరిష్కరించండి, మా పి ఆర్ లు మాకు ఇవ్వండి, అని అడుగుతున్న పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ గారు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు.

మరి ముఖ్యంగా విద్యార్థులే స్వయంగా వెళ్లి మా సమస్యను పరిష్కరించండి అంటూ ఎన్ఎంసి నీ కోరగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి పిఆర్లు ఇవ్వచ్చని మెయిల్ ద్వారా రిజిస్టర్ రమేష్ పంపించడం జరిగింది.

ఏమాత్రం ఎన్ఎంసి చెప్పినటువంటి నిబంధనలను పాటించకుండా నా సొంత నిర్ణయాలు ఏపీఎంసీలో అమలు చేస్తాను.
నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా అధికారి తీరు ఉంది. దేశమంతటా అమలు చేస్తున్న ఎన్ఎంసి రూల్స్ కానీ ఆంధ్ర రాష్ట్రానికి లేవంటున్న ఏపీఎంసీ రిజిస్టర్ .

ప్రధానం గా మే 2023, నవంబర్ 2023, మే 2024 బ్యాచులకు ఇంటెన్షిప్ ఒక్క సంవత్సరం చేయమని అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి అవుతున్న దశలో ఇంకా ఒక నెల ఉన్న సమయంలో మీరు రెండు సంవత్సరాలు చేయమని కొందరిని, మరికొందరిని మూడు సంవత్సరాలు చేయమని వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పింది రాజ్యాంగం అన్నట్టుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా లేదని కూడా ఆలోచన చేయకుండా నిబంధనలు మార్చుకుంటూ పోతున్నారు.

దీని వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

వైద్య విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది,ఏ స్టేట్ లో కూడా లేనిది కేవలం ఏపి లోనే ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు.

APMC రిజిస్ట్రార్ పిల్లల మీద కక్ష సాధింపు చర్యలు కట్టిపెట్టి రిజిస్ట్రేషన్ లు చెయ్యాలి అని వాపోతున్న FMG ల తల్లిదండ్రులు.

ఫారిన్ వెళ్లేది చదువు కోవాలి అనే ఆశ చచ్చిపోక కానీ డబ్బులు ఎక్కువ అయి కాదు.

ప్రతి ఒక్క స్టూడెంట్ మీద 25లక్షల వరకు అప్పులు ఉన్నాయి అవి తీర్చాల్సిన్ బాధ్యత మా మీద ఉంది అని ఇంకా రిజిస్ట్రేషన్ లు ఇవ్వకపోతే మరణమే శరణం అంటున్న ఏపీ FMG లు.

కేవలం ఏపీ లో మాత్రం ఈ వివక్ష ఎందుకు అని మనస్థాపానికి గురైన విద్యార్థులు.

రిజిస్ట్రార్ వ్యక్తిగత నిర్ణయాలను APMC లొ అమలు చేయ డం వల్ల FMG విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు చదువులు, సేవ చేయాలి అనే వారి ఆశ కి అడ్డుకట్ట వేస్తున్నారు.

ఏపీఎంసీ రిజిస్ట్రార్ పిల్లల ప్రాణాలతో చెలగతం ఆడుతున్నారని
వాపోతున్నారు.

ఈ సమస్య పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటారని, విద్యార్థులకు న్యాయం చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here