మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న మా కుమారుల్ని రక్షించండి
• రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మహిళ వినతి
• సమస్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లిన పవన్ కళ్యాణ్
ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ గండబోయిన సూర్యకుమారి అనే మహిళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ని సూర్యకుమారి కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం పవన్ కళ్యాణ్ ని కలసి.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు.