మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపి కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు బుద్దా వెంకన్న కీలక కామెంట్స్

Spread the love

 మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపి కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు

 బుద్దా వెంకన్న కీలక కామెంట్స్

పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా

సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గింది

ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారు

నా మాట చెల్లలేదు

ఆవేదన గా ఉంది…

ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను

ఇంకా నన్ను నమ్ముకున్న వారికి నేనేమీ చేస్తాను…నన్ను కార్యకర్తలు క్షమించాలి

2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్ర బాబు నాయుడు చిత్ర పటం కాళ్ళు కడిగాను

నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు 

చంద్ర బాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వెళితే నేను వెళ్లి అడ్డుకుని నిలబడ్డా

ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు వచ్చారో చెప్పాలి

ఐదేళ్ల వైసిపి దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశా

వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడా 

నా మీద మొత్తం 37 కేసులు పెట్టారు 

37 కేసులు టిడిపి పార్టీ కోసమే నేను పెట్టించుకున్న 

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా… ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదు 

గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టిడిపిలో టికెట్లు పొందారు 

నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా 

అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా

నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్న 

2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా 

నేను చచ్చిపోయే వరకు టిడిపిలోనే ఉంటా 

ఎంపీ కేసినేని చిన్ని మూడుసార్లు ఎంపీగా గెలవడం ఖాయం

కేశినేని నాని లాగా కేశినేని చిన్ని మాటల మనిషి కాదు… చేతల మనిషి 

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక బాధ్యతలు చంద్రబాబు నాయుడు కేశినేని చిన్ని పై పెట్టారంటే ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుంది 

నా ఆవేదనను కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి 

 *కేశినేని చిన్ని కామెంట్స్:* 

పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బిజెపికి ఇవ్వాల్సి వచ్చింది 

పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు 

ఆ విషయం నాకు తెలుసు 

దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా 

త్వరలోనే బుద్ధ వెంకన్న, నాగుల్ మీర్రాకు కూడా మంచి పదవులు వస్తాయి 

కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్య పడవద్దు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *