Home Andhra Pradesh మహిళా సంస్థలతోనే వ్యవస్థ బలోపేతం రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

మహిళా సంస్థలతోనే వ్యవస్థ బలోపేతం రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

6
0

మహిళా సంస్థలతోనే వ్యవస్థ బలోపేతం

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

ఆనందపురం, ఆగస్టు 7: సమాజాభివృద్ధికి మౌలిక స్థంభంగా నిలుస్తున్న మహిళా సంస్థలు నేటి యుగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నం లోని ఆనందపురం మండలం గంభీరంలోని హోటల్ చందనలో ఏర్పాటు చేసిన విశాఖ మహిళ కో ఆపరేటివ్ సొసైటీ రజతోత్సవ సభకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. విశాఖ మహిళా కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ యలమంచిలి ప్రసూనాంబ మంత్రి అచ్చెన్నాయుడు కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి , విద్య, ఆరోగ్య రంగాల్లో మహిళా సంస్థలు దోహదం చేస్తాయని అన్నారు. మహిళల సాధికారతే నేటి వ్యవస్థను బలంగా మార్చగల శక్తి అని, మహిళల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. 25 ఏళ్ల క్రితం కేవలం 10 మంది మహిళ ఉద్యోగులతో ప్రారంభమైన మహిళా కో ఆపరేటివ్ సొసైటీ 10 బ్రాంచీలు, రూ.100 కోట్ల వ్యాపార టర్నోవర్ సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆర్థిక విషయాల్లో మహిళలు అద్భుత ప్రతిభా కనబరుస్తున్నారని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు స్వయం సమృద్ధి సాధించేలా ముద్ర రుణాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గిన ప్రోత్సాహం ఇస్తుంద‌న్నారు. చిన్న వ్యాపారులను ఆర్థికంగా నిలబెట్టడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. మహిళల కోసం అన్న ఎన్టీఆర్ అనేక చట్టాలు, పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఆస్తిలో మహిళలకు సగం వాటా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు.. ఎన్టీఆర్ ఆలోచన నుంచి పుట్టినవేనన్నారు. 1995 సంవ‌త్స‌రంలో ఇందుకోసం యాక్ట్ తీసుకురావడం వల్ల అనేక కో ఆపరేటివ్ బ్యాంకులు పోటీలో నిలదొక్కుకున్నాయని చెప్పారు. మహిళల నిజాయతీ, నిబద్ధతల కారణంగానే డ్వాక్రా విజయవంతం అయ్యిందని తెలిపారు. పాతికేళ్ల నుంచి మహిళల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న విశాఖ మహిళా కో ఆపరేటివ్ సొసైటీ యాజమాన్యానికి, ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల శక్తిని వెలికి తీసే ప్రయత్నాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here