మహిళా ఉద్యోగుల సమస్యలపరిష్కారం ఎపి ఎన్జీజీఓ సంఘ బాధ్యత..మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి.

1
0

మహిళా ఉద్యోగుల సమస్యల
పరిష్కారం ఎపి ఎన్జీజీఓ సంఘ బాధ్యత..
మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి.
జిల్లాలలో మహిళా విభాగాలను సంఘాలను బలోపేతం చేచేయాలి
యువతరం మహిళా నాయకులను ప్రోత్సహించండి…
సంఘ బలం.సమస్యల
పరిష్కారానికి ఊతం
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్
విజయవాడ :
దేశంలో ఏ ఉద్యోగ సంఘానికీ లేనంత చరిత్ర ఒక్క ఏపీ ఎన్జీజీఓకి మాత్రమే ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని సంఘం గౌరవ ప్రతిష్టను పెంచే విధంగా బాధ్యతగా సంఘాన్ని బలోపేతం చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేరేందుకు కృషి చేస్తామని
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపి ఎన్జీజీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ లోని ఎన్జీజిఓ హోమ్ లో చైర్ పర్సన్ వి. నిర్మల కుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం సంఘం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్జిజీవోలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగుల సంఘాలలో మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.మహిళా ఉద్యోగుల సంఘం కూడా తాలూకా, జిల్లాస్థాయిలో బలమైన నిర్మాణం చేసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా బకాయి ఉన్న
డిఏలను వెంటనే విడుదల చేయాలనీ, పి ఆర్ సి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆద్యయన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మహిళా ఉద్యోగుల సంఘం చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు భారంగా మారిన
అనవసరమైన యాప్స్ తొలగింపు అంశంలో ఉన్నతాధికారులను కోరతామన్నారు. ఈ విషయంలో మహిళా ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకుంటున్నాన న్నారు. రూరల్ ఏరియాలో మహిళా ఉద్యోగులపై ఒత్తిళ్లు తగ్గించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, కార్యాలయ
పనివేళలు ముగిసిన తర్వాత నిర్వహించే జూమ్ మీటింగ్ లలో పాల్గొనకుండా మహిళా ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న మహిళా ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాలలో పరిశుభ్రత, ప్రత్యేకంగా టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణ విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, మహిళా ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించి, వాటి అమలుకు కృషి చేయాలని మహిళా విభాగ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ, రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్
పి. మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి. లలిలాంబ, రాష్ట్ర కార్యదర్శి బి. తులసి రత్నం, వివిధ జిల్లాల మహిళా నాయకులు, ఏఐఎస్ జిఇఎఫ్ మహిళ సబ్ కమిటి కన్వీనర్ యం. రాజ్యలక్ష్మి, ఏఐఎస్జిఇఎఫ్
ఎన్ఈసి సభ్యురాలు వి. శాంత మరియు క్యాపిటల్ సిటీ మహిళా నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here